Skip to main content

నేటి నుంచి పీజీఈసెట్ 2020 పరీక్షలు

సాక్షి, హైదరాబాద్: పీజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు పీజీఈసెట్-2020 నిర్వహించనున్నట్లు పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.కుమార్ తెలిపారు.
పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షలకు మొత్తం 21,870 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, పరీక్షల నిర్వహణకు వరంగల్‌లో 8 కేంద్రాలు, హైదరాబాద్‌లో 14 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Published date : 21 Sep 2020 03:47PM

Photo Stories