Skip to main content

నేటి నుంచి జేఈఈ మెయిన్స్ మూడో దశ– 2021 పరీక్షలు

సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ మూడో దశ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

ఏప్రిల్లో నిర్వహించాల్సిన ఈ పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. జూలై 20, 22, 25, 27 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 7,09,519 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. ఏపీ నుంచి 40 వేల మంది వరకూ హాజరుకానున్నారు.

జేఈఈ మెయిన్‌– 2021 సిలబస్, స్టడీ మెటీరియల్, బిట్‌ బ్యాంక్స్, ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్స్, మోడల్‌ పేపర్స్, ప్రీవియస్‌ పేపర్స్‌.. ఇతర అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

నాలుగో దశ పరీక్షలకు దరఖాస్తు గడువు నేటితో పూర్తి
జేఈఈ మెయిన్‌ నాలుగో దశ పరీక్షలకు దరఖాస్తు గడువు మంగళవారంతో ముగియనుంది. ఈ పరీక్షలు ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్‌ 1, 2 తేదీల్లో జరగనున్నాయి.

చ‌ద‌వండి: త్వరలో 1,200కు పైగా పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు

చ‌ద‌వండి: ఆయుష్ విద్యార్థుల స్టైఫండ్ విడుదల.. ఒక్కొ విద్యార్థికి రూ.7 లక్షలు..

Published date : 26 Aug 2021 05:05PM

Photo Stories