నేటి నుంచి బీడీఎస్ అడ్మిషన్లకు వెబ్ ఆప్షన్స్
Sakshi Education
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పరిధిలోని దంత వైద్య కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని రిజిస్ట్రార్ డాక్టర్ శంకర్ సూచించారు.
సోమవారం ఉదయం 8 నుంచి డిసెంబర్ 23వ తేదీ ఉదయం 8 గంటల వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చని తెలిపారు. కాగా, ఎంబీబీఎస్ రెండో విడత కౌన్సెలింగ్ ఆదివారంతో ముగిసింది. దీనిలో 175 సాధారణ అడ్మిషన్లతో పాటు 179 స్పెషల్ కేటగిరి అడ్మిషన్లను చేపట్టారు.
Published date : 21 Dec 2020 03:39PM