నేటి అర్ధరాత్రి వరకు టీచర్ల బదిలీల వెబ్ ఆప్షన్, సవరణలకు అవకాశం
Sakshi Education
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ బదిలీల వెబ్ ఆప్షన్‌తో పాటు సవరణలకు డిసెంబర్ 18 తేదీ (శుక్రవారం) అర్ధరాత్రి 12 గంటల వరకు అవకాశమిస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
ఉపాధ్యాయుల్లేక మారుమూల ప్రాంత పాఠశాలలు మూతపడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కొన్ని ఖాళీలను బ్లాక్ చేశామన్నారు. వెబ్ ఆప్షన్ ప్రక్రియ పూర్తికాగానే ఈ నెల 19 తేదీ తరువాత బదిలీల ఉత్తర్వులు అందజేస్తామన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోస్టుల బ్లాకింగ్ ఎత్తేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న 145 మండలాల్లోని 5,725 పాఠశాలల్లో 10,198 పోస్టులు భర్తీ కావని, దీనివల్ల ఉపాధ్యాయుల్లేక ఆ పాఠశాలలు మూతపడడం ఖాయమని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే 16 వేల పోస్టులను బ్లాక్ చేశామన్నారు. త్వరలో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణ తేదీలను వెల్లడిస్తామని చెప్పారు.
Published date : 18 Dec 2020 02:09PM