నేడు, రేపు తెలంగాణ ఎడ్‌సెట్– 2021 పరీక్షలు
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: టీఎస్ ఎడ్‌సెట్–2021 నేడు, రేపు జరగనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ సోమవారం తెలిపారు.
ఉదయం, మధ్యాహ్నం జరిగే ప్రవేశ పరీక్షకు నిమిషం ఆలస్యమైన అనుమతించమని, పరీక్ష కేంద్రానికి గంటన్నర ముందు చేరుకోవాలన్నారు. 42,399 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. తెలంగాణలో 45.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, విజయవాడల్లో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన్నట్లు చెప్పారు. కోవిడ్ నిబంధనల ప్రకారం పరీక్షకు హాజరుకావాలన్నారు.
Published date : 24 Aug 2021 03:31PM