నేడు, రేపు అగ్రికల్చర్ ఎంసెట్ 2020.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఏర్పాటు చేసిన 84 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు దాదాపు 79 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. తెలంగాణలోని 67 కేంద్రాల్లో 62,800 మంది, ఏపీలోని 17 కేంద్రాల్లో 16,200 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వివరించారు. ఆన్‌లైన్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరొక సెషన్ ఉంటుందని వివరించారు. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను గంటన్నర ముందు నుంచే అనుమతిస్తామని, వీలైనంత ముందుగా చేరుకోవాలని సూచించారు.
Must Check:
EAMCET Quick Review, Bit banks and Practice Tests
పరీక్ష ప్రారంభం అయ్యాక నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని పేర్కొన్నారు. సోమవారం పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థులకు ఆదివారమే మెసేజ్ పంపించామని, 29వ తేదీన పరీక్షకు హాజరు కావాల్సిన వారికి సోమవారం మెసేజ్ పంపిస్తామని వెల్లడించారు. కరోనా సంబంధిత లక్షణాలు... జలుబు, జ్వరం, దగ్గు వంటివి తమకు లేవని విద్యార్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. వాటిపై డాక్టర్ల సంతకం అవసరం లేదన్నారు. అలాగే విద్యార్థుల హాల్ టికెట్‌పై గెజిటెడ్ అధికారి సంతకం తప్పనిసరి కాదన్నారు. విద్యార్థులు ఓటర్ ఐడీ, ఆధార్ వంటి ఏదో ఒక ఒరిజినల్ ఐడీ కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు.