నేడు ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నేడు ప్రకటన విడుదల చేస్తామని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ కార్యదర్శి కృష్ణారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు పత్రాలను నేటి నుంచి జనవరి 5వ తేదీ వరకు పొందవచ్చని వెల్లడించారు. విద్యార్థులు టీఎస్ ఆన్‌లైన్/మీసేవ/ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లో నిర్ణీత ఫీజు చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఆలస్య రుసుముతో జనవరి15వ తేదీ వరకు రిజిస్టర్ చేసుకోవచ్చని, దరఖాస్తు పత్రాలను వచ్చేనెల 15లోగా టీఎస్ ఆన్‌లైన్/మీసేవ/ఏపీ ఆన్‌లైన్ ద్వారా సబ్మిట్ చేయాలని వివరించారు. మిగతా వివరాలను www.telanganaopenschool.org లో చూడవచ్చని, లేదా డీఈఓ కార్యాలయాల్లో తెలుసుకోవచ్చని వెల్లడించారు.
Published date : 10 Dec 2020 04:15PM