నేడు డిగ్రీ సీట్ల కేటాయింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సోమవారం సీట్లు కేటాయించనున్నట్లు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు.
డిగ్రీలోని వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,63,300 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోగా.. 1,53,323 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారికి మాత్రమే సీట్లు కేటాయించనున్నట్లు ఆయన వెల్లడించారు.
Published date : 21 Sep 2020 03:48PM