నాలుగు శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు పొడిగింపు
Sakshi Education
సాక్షి, అమరావతి: నాలుగు శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును పొడిగిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
న్యాయ, విద్యా శాఖ, ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ, యువజన సర్వీసులు పర్యాటక శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు కాలాన్ని వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలా ఉండగా, మిగతా శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల ఆవశ్యకత గురించి ఆయా శాఖలు ఆర్థిక శాఖకు నివేదిక సమర్పించిన తరువాత ఆయా శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును కూడా ప్రభుత్వం పొడిగిస్తుందని, ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
Published date : 12 Nov 2020 04:50PM