Skip to main content

ముగిసిన ట్రిపుల్ ఐటీల కౌన్సెలింగ్.. తరగతులుఎప్పటినుంచంటే..

నూజివీడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలకు చెందిన ప్రవేశాల కౌన్సెలింగ్ సోమవారం రాత్రి ముగిసింది.
నాలుగు ట్రిపుల్ ఐటీలలో కలిపి 4,400 సీట్ల భర్తీకి ఈ నెల 4వ తేదీన కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ప్రత్యేక కేటగిరి సీట్లు 273 మినహాయించగా మిగిలిన 4,127 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్ ముగిసే సరికి శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీకి సంబంధించి ఎస్టీ కేటగిరీకి చెందిన 9సీట్లు మిగిలినట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు తెలిపారు. వీటిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 7 సీట్లు, ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 2 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లను ప్రత్యేక కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో భర్తీ చేస్తామన్నారు. పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఈ నెల 18వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని గోపాలరాజు తెలిపారు.
Published date : 12 Jan 2021 02:32PM

Photo Stories