ముగిసిన పీజీ తొలి విడత కౌన్సెలింగ్: ఓయూ
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): తెలంగాణలోని ఏడు యూనివర్సిటీలకు 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది.
సీపీజీఈటీ-2020 ద్వారా ఓయూ నిర్వహించిన ఆన్‌లైన్ మొదటి విడత కౌన్సెలింగ్ ముగిసింది. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన 25 వేల మంది విద్యార్థుల జాబితాను ప్రకటించినట్లు కన్వీనర్ ప్రొ.కిషన్ తెలిపారు. వారు ఈ నెల 17 వరకు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయాలన్నారు. 7 వర్సిటీల్లో 38 వేల పీజీ సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్ తర్వాత 12 వేల సీట్లు మిగిలాయని తెలిపారు. ఎంకామ్‌లో 4,800, ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్‌లో 1,500 సీట్లు మిగిలినట్లు పేర్కొన్నారు.
Published date : 15 Feb 2021 03:13PM