మొత్తం 1,26,641 పోస్టులు: తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ప్రభుత్వోద్యోగాల భర్తీ లెక్క ఇదే..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014, 2 జూన్ నుంచి గత ఏడాది డిసెంబర్ 16 వరకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఈ మేరకు పోస్టులు భర్తీ అయ్యాయని పేర్కొంది. ఇందులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ద్వారా 30,594 పోస్టులు, పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు (టీఎస్ ఎల్పీ ఆర్‌బీ) ద్వారా 31,972 పోస్టులు, పలు విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్లను క్రమబద్ధీకరించడం ద్వారా 22,637 పోస్టులు, పంచాయతీ రాజ్ శాఖలో 10,763 పోస్టులను డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా, శాఖాపరమైన పదోన్నతుల ద్వారా 11,278 పోస్టులను భర్తీ చేసినట్టు వెల్లడించింది. ఇందులో ఆర్టిజన్ల క్రమబద్ధీకరణతో పాటు మొత్తం 53,264 పోస్టులకు ఇంకా తమ అనుమతి ఇవ్వాల్సి ఉందని, ఇందులో ఇప్పటికే 49,174 పోస్టులు భర్తీ అయ్యాయని స్పష్టం చేసింది. మొత్తంగా గత ఆరున్నరేళ్లలో మొత్తం భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చిన 1,50,326 పోస్టులకు గాను 1,32,899 పోస్టులను నోటిఫై చేయగా, ఇందులో 1,26,641 భర్తీ అయ్యాయని, మరో 23,685 భర్తీ దశలో నిలిచిపోయాయని స్పష్టం చేసింది.
‘హోం’లో అత్యధికం... ఉన్నత విద్యలో సున్న
ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో హోంశాఖ ముందంజలో ఉంది. పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా వివిధ స్థాయిల్లో 31,972 ఉద్యోగాలు కల్పించగా, ఆ తర్వాత పంచాయతీ రాజ్‌లో 10,763, పాఠశాల విద్యలో 8,443 పోస్టులు భర్తీ అయ్యాయి. ఇక, ఉన్నత విద్యలో 1,061 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతి లభించగా, ఇప్పటివరకు ఒక్క పోస్టు కూడా నియమించలేదని ఆర్థిక శాఖ లెక్కలు చెబుతున్నాయి. అలాగే న్యాయ శాఖలో 9, పరిశ్రమల శాఖలో 20, ఆర్థిక శాఖలో 27, సాధారణ పరిపాలన శాఖలో 90 పోస్టులను మాత్రమే భర్తీ చేసినట్లు ఆ నివేదిక వెల్లడిస్తోంది. మిగిలిన శాఖల్లో కూడా 100 నుంచి 3 వేల చొప్పున ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయింది.
ఆ రెండు వర్సిటీల్లోనే..
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఉద్యోగాల భర్తీలో వెనుకబడ్డాయి. 15 వర్సిటీలకు గాను రెండింటిలోనే 259 (వ్యవసాయ వర్సిటీలో 179, ఉద్యాన వర్సిటీలో 80) ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. పశు వైద్య విశ్వవిద్యాలయం (244), అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ (10), ఫైన్ ఆర్‌ట్స వర్సిటీ (15), జేఎన్‌టీయూ (186), కాకతీయ (136), ఎంజీ వర్సిటీ (34), ఉస్మానియా (415), పాలమూరు (63), ఆర్జీయూకేటీ-బాసర (96), శాతవాహన (40), తెలుగు వర్సిటీ (7), తెలంగాణ వర్సిటీ (59)ల్లో ఒక్క అధ్యాపక, ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టలేదు.
సీఎం నిర్దేశించిన 50 వేల మాటేంటి?
ఇటీవల ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. డెరైక్ట్ రిక్రూట్‌మెంట్‌తో పాటు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన 50 వేల పోస్టుల వరకు వెంటనే గుర్తించి భర్తీ చేయాలని ఆయన సీఎస్‌ను ఆదేశించారు. అయితే, సీఎం చెప్పిన 50వేల పోస్టులతో పాటు అదనంగా తేలే అవకాశాలు కనిపిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. ఇందులో ఆర్థిక శాఖ తయారుచేసిన తాజా నివేదిక ప్రకారం.. 23,685 పోస్టులుండగా, మరో 20వేల వరకు పోలీసు శాఖలో, 10వేల పోస్టుల వరకు విద్యా శాఖలో ఉంటాయని సమాచారం. వీటితో పాటు ప్రతియేటా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి రిటైరయ్యే వారిని పరిగణనలోకి తీసుకుంటే ఈ ఆరున్నరేళ్లలో వీరి సంఖ్య 10వేలకు పైగా ఉంటుందని అంచనా. ఇవే కాక, వివిధ కార్పొరేషన్లు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, వైద్య, ఆరోగ్య శాఖల్లో కూడా పెద్ద సంఖ్యలోనే ఖాళీలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెలాఖరు కల్లా పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చేలా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు కూడా విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం.
2014, జూన్ 2 నుంచి 2020, డిసెంబర్ 16 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు, నోటిఫైడ్ ఉద్యోగాలు, భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలివి...
రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ | అనుమతి వచ్చినవి | నోటిఫైడ్ | భర్తీచేసినవి | ఖాళీలు |
టీఎస్‌పీఎస్సీ | 39,952 | 36,581 | 30,594 | 9,358 |
టీఎస్‌ఎల్పీఆర్‌బీ | 31,972 | 31,972 | 31,972 | ---- |
టీఆర్‌ఈఐఆర్‌బీ | 7,016 | 3,678 | 3,623 | 3,393 |
ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ | 1,466 | ---- | ---- | 1,466 |
డీపీసీ | 16,656 | 11,494 | 11,278 | 5,378 |
ఇతర పోస్టులు | 53,264 | 49,174 | 49,174 | 4,090 |
మొత్తం | 1,50,326 | 1,32,899 | 1,26,641 | 23,685 |
శాఖల వారీగా భర్తీ చేసినవి...
శాఖ | అనుమతి వచ్చినవి | నోటిఫైడ్ | భర్తీ చేసినవి |
వ్యవసాయ, సహకార శాఖలు | 2,915 | 2,768 | 2,705 |
పశుసంవర్ధక | 1,236 | 911 | 889 |
బీసీ సంక్షేమం | 4,592 | 2,694 | 2,510 |
అటవీ, పర్యావరణం | 2,189 | 2,154 | 2,154 |
ఇంధన శాఖ | 2,681 | 1,580 | 1,427 |
ఆర్థిక | 39 | 28 | 27 |
సాధారణ పరిపాలన | 116 | 90 | 90 |
ఉన్నత విద్య | 1,061 | 0 | 0 |
వైద్య, ఆరోగ్య శాఖ | 10,141 | 5,418 | 1,072 |
హోం | 32,516 | 32,143 | 32,143 |
నీటి పారుదల | 909 | 905 | 905 |
పరిశ్రమలు | 26 | 21 | 20 |
న్యాయ శాఖ | 12 | 12 | 9 |
ఎల్‌ఈటీ అండ్ ఎఫ్ | 331 | 53 | 52 |
మున్సిపల్ | 1,649 | 1,196 | 1,193 |
మైనార్టీ సంక్షేమం | 4,197 | 3,939 | 3,557 |
ప్లానింగ్ | 474 | 474 | 474 |
పంచాయతీరాజ్ | 10,911 | 10,763 | 10,763 |
రెవెన్యూ | 3,466 | 2,934 | 2,934 |
దళిత అభివృద్ధి | 4,360 | 3,951 | 3,671 |
పాఠశాల విద్య | 9,260 | 9,164 | 8,443 |
గిరిజన సంక్షేమం | 2,459 | 1,604 | 1,506 |
మహిళా, శిశు సంక్షేమం | 472 | 147 | 147 |
ఇతర పోస్టులు | 53,264 | 49,174 | 49,174 |
కార్పొరేషన్లు, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థల్లో పదోన్నతుల ద్వారా భర్తీ చేసినవి...
సంస్థ | అనుమతి వచ్చినవి | నోటిఫైడ్ | భర్తీ చేసినవి | ఖాళీలు |
నిమ్స్ | 399 | ---- | ---- | 399 |
పబ్లిక్ హెల్త్ | 528 | ---- | ----- | 528 |
జెన్‌కో | 1,080 | 856 | 856 | 224 |
ఎన్పీడీసీఎల్ | 623 | 164 | 164 | 459 |
ఎస్పీడీసీఎల్ | 580 | 354 | 201 | 379 |
ట్రాన్స్ కో | 398 | 206 | 206 | 192 |
ఆర్థిక శాఖ అనుమతి లభించాల్సిన పోస్టులు...
సంస్థ | అనుమతి వచ్చినవి | నోటిఫైడ్ | భర్తీ చేసినవి | ఖాళీలు |
ఆర్టీసీ | 4,768 | 4,768 | 4,768 | --- |
సింగరేణి | 12,500 | 12,500 | 12,500 |
|
విద్యుత్ సంస్థలు | 10,676 | 6,648 | 6,648 | 4,028 |
ఆర్టిజన్ల క్రమబద్ధీకరణ | 22,637 | 22,637 | 22,637 | --- |
వాటర్ బోర్డు | 807 | 807 | 807 | --- |
టీఎస్‌క్యాబ్ | 305 | 243 | 243 | 62 |
డీసీసీబీలు | 1,571 | 1,571 | 1,571 | --- |
మొత్తం | 53,264 | 49,174 | 49,174 | 4,090 |