Skip to main content

మోడల్‌ స్కూళ్ల ప్రవేశాల గడువు ఆగస్టు 25వ తేదీ వరకు పెంపు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆదర్శ పాఠశాలల్లో 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి
ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు ఏపీఎంఎస్‌ డైరక్టర్‌ డి.మధుసూదనరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను గడువు తేదీ లోపల ఆన్‌లైన్లో సమర్పించాలని సూచించారు.
Published date : 01 Aug 2020 04:07PM

Photo Stories