మొదటి విడతలో రూ.4,400 కోట్లతో పాఠశాలల అభివృద్ధి: చినవీరభద్రుడు
Sakshi Education
పీలేరు (చిత్తూరు జిల్లా): నాడు–నేడు పనుల్లో భాగంగా మొదటి విడత రూ.4,400 కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేసినట్లు రాష్ట్ర విద్యా శాఖ సంచాలకులు చినవీరభద్రుడు తెలిపారు.
మంగళవారం పీలేరు మండలం కోటపల్లె జెడ్పీ బాలికోన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలలకు గానూ మొదటిదశలో 15,715 పాఠశాలలను నాడు–నేడు కింద అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దాదాపు అన్ని పాఠశాలల్లో పనులు పూర్తయినట్లు చెప్పారు. రెండో విడత దాదాపు 15 వేల పాఠశాలల్లో నాడు–నేడు పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విద్యాసంవత్సరంలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల నుంచి 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు.
Published date : 07 Apr 2021 05:26PM