‘మనూ’లో జాతీయ ఉర్దూ సైన్‌స కాంగ్రెస్
Sakshi Education
హైదరాబాద్: ఫిబ్రవరి 25, 26 తేదీల్లో జరగనున్న జాతీయ ఉర్దూ సైన్‌స కాంగ్రెస్ సదస్సుకు మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) వేదిక కానుంది.
యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ నాలెడ్‌జ ఇన్ ఉర్దూ (సీపీకేయూ), స్కూల్ ఆఫ్ సెన్సైస్‌లు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించనున్నాయి. ఉర్దూ భాషలో సైన్‌సను ప్రోత్సహించడం కోసం ఈ సదస్సును నిర్వహిస్తారు. ఉర్దూ భాషలో సైన్‌స ప్రమోషన్ అంశంపై ఆసక్తి గలవారు 2,500 నుంచి 3వేల పదాల మధ్య ఉర్దూలో రాసి పత్రసమర్పణ చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. పత్రాల సమర్పణకు ఫిబ్రవరి 15ను చివరి తేదీగా నిర్ణయించారు. సదస్సుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం డాక్టర్ ఆబిద్ మొయిజ్ (9502044291), డాక్టర్ హెచ్.అలీమ్‌బాషా (9849098620), డాక్టర్ మక్బూల్ అహ్మద్‌లను (9440366462) సంప్రదించవచ్చు.
Published date : 28 Jan 2020 02:54PM