మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలా పని చేయండి...
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏ రాష్ట్ర కేడర్‌లో పనిచేసినా ఏపీకి పేరు తెచ్చేలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని సివిల్స్ విజేతలకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటీవల సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన 10 మంది తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా సెఫ్టెంబర్ 29న కలిశారు. ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి అభినందించారు. వృత్తిలో రాణించి, ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు.
Published date : 30 Sep 2020 04:44PM