మహనీయుల బోధనలను ఆచరించాలి!
Sakshi Education
విద్యార్థులు మహనీయుల బోధనలను ఆచరించేందుకు యత్నించాలి. మహనీయుల మార్గంలో నడిచే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవడం తథ్యం. పూర్వకాలంలో మహనీయులు తాము ఆచరించిన ఉన్నతమైన మార్గాన్ని, సత్యాలను ప్రపంచానికి చాటిచెప్పారు.
మనిషి ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో సూచించారు. సమాజానికి మార్గదర్శకత్వం వహించారు. అయితే ఈనాడు మన ప్రాచీన రుషులు ప్రవచించిన సత్యాలను అర్థం చేసుకోలేక, వాటిని కట్టుకథలుగా భావించి అపహాస్యం చేస్తున్నారు. ప్రాచీన సంస్కృతి /పవిత్రతను గుర్తించుకునే శక్తిసామర్థ్యములను కోల్పోయి, తనలోనే ఉన్న పరమ సత్యమును తాను గుర్తించుకోలేకపోతున్నాడు. మహనీయుడి విగ్రహాలను ఊరిలో పలుచోట్ల ప్రతిష్టిస్తున్నారేగానీ, వారి ప్రబోధాలను ఏమాత్రం లక్ష్యం చేయడంలేదు. ఆ పవిత్రమైన స్వరూపాలను బాహ్యంగా ప్రతిష్టిస్తే సరిపోదు, వాటిని తన హృదయ పీఠంపైన భద్రం చేసుకోవాలి. వారి ప్రబోధాలను ఆచరణ లో పెట్టాలి. కణాదుడు ఏ కాలంనాటివాడు? ఇరవైవేల సంవత్సరాలకు పూర్వం ఈ కణాదుడి విషయం జగత్తులో ఎంతగానోవ్యాప్తమైంది. ఈనాటి సైంటిస్టులు గుర్తించిన ఆక్సిజను, హైడ్రోజను తత్త్వాన్ని కణాదుడు ఆనాడే గుర్తించాడు. అయితే ప్రజలు సైంటిస్టుల మాటలను విశ్వసిస్తూ , ప్రాచీన రుషులు అనుభవించి, ఆనందించి, అందిం చిన సత్యవాక్యములను విస్మరిస్తున్నారు. దైవత్వమును అణువుద్వారానే గుర్తించవచ్చని ప్రబోధించాడు కణాదుడు. అణువు కంటికి కనిపించదు. కానీ అది మనం తినేతిండిలో ఉంటుంది. మాట్లాడే మాటలో ఉంది. నడిచే నడకలో ఉన్నది. సర్వత్రా, ఉన్నది అణువే. అణువుపైనే నడుస్తూ , అణువునే తింటూ, తాగుతూ, అణుతత్త్వాన్నే అనుభవిస్తూ విస్మరిస్తున్నాం. ఇది సరికాదు.
Published date : 27 Jan 2020 01:02PM