మహిళా ఆర్టిజన్లకు ప్రసూతి సెలవులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ కోలో పని చేస్తున్న మహిళా ఆర్టిజన్లకు ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని ఆదేశిస్తూ సంస్థ సీఎండీ డి.ప్రభాకర్‌రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
వివాహిత మహిళా ఆర్టిజన్లకు పూర్తి వేతనంతో 26 నెలల ప్రసూతి సెలవును మంజూరు చేయాలని, ఇద్దరి కన్నా తక్కువ సంతానం బతికి ఉన్న వారికి సైతం ప్రసూతి సెలవులు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇద్దరి కన్నా తక్కువ సంతానం బతికి ఉండి, అబార్షన్, గర్భస్రావానికి గురైన మహిళా ఆర్టిజన్లకు పూర్తి వేతనంతో కూడిన 6 వారాల ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగ సంఘాలతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందం అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published date : 10 Jan 2020 04:42PM