Skip to main content

మెరుగవుతున్న ఉద్యోగ నియామకాలు: టీమ్‌లీజ్

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుందని.. దీంతో ఉపాధి రంగంలో సానుకూలత కనబడుతోందని టీమ్‌లీజ్ క్యూ3 ఎంప్లాయిమెంట్ ఔట్‌లుక్ రిపోర్ట్ తెలిపింది.
సెప్టెంబర్ త్రైమాసికంలో పెద్ద, మధ్య స్థాయి కంపెనీలు ఉద్యోగుల నియామకంలో 3% వృద్ధిని నమోదు చేశాయని పేర్కొంది. ఉపాధి అవకాశాల మెరుగుదల కోవిడ్-19 కంటే ముందు స్థాయికి చేరుకోనప్పటికీ.. క్రమంగా సానుకూల ధోరణి కనిపిస్తోందని టీమ్‌లీజ్ కో-ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రితుపర్ణ చక్రవర్తి తెలిపారు.
Published date : 03 Dec 2020 05:13PM

Photo Stories