మే 3 నుంచి డీఎడ్ ఫస్టియర్ పరీక్షలు..
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2019–21 బ్యాచ్‌కు చెందిన డీఎడ్ ఫస్టియర్ విద్యార్థులకు మే 3 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
మే 8 వరకు జరిగే ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 11.30 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్ష ఫీజును ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 1 లోగా చెల్లించవచ్చని.. రూ.50 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 8 వరకు చెల్లించవచ్చని తెలిపారు.
Published date : 18 Mar 2021 05:37PM