Skip to main content

మైనార్టీ గురుకుల జూనియర్ కాలేజీల్లో 840 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని జూనియర్ కళాశాలల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో బోధన సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ మేరకు మొత్తం 111 కాలేజీల్లో 840 ఔట్‌సోర్సింగ్‌ లెక్చరర్‌ పోస్టులను ఏజెన్సీల ద్వారా భర్తీ చేయనున్నారు. సొసైటీ పరిధిలో కొత్తగా 11 జూనియర్‌ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. 2021–22 విద్యా సంవత్సరం నుంచే అవి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేసిన సొసైటీ తాజాగా నియామకాలను చేపట్టింది. రాష్ట్ర స్థాయిలో సొసైటీ పరిధిలో ఓ కమిటీ, జిల్లాస్థాయిలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీలు నియామక ప్రక్రియను పర్యవేక్షిస్తాయి.

ఔట్‌సోర్సింగ్‌ ఖాళీలు

సబ్జెక్టు

లెక్చరర్‌ పోస్టులు

ఇంగ్లి‹Ù

111

ఉర్దూ

111

తెలుగు

111

మ్యాథ్స్‌

80

ఫిజిక్స్‌

63

కెమిస్ట్రీ

63

బోటనీ

63

జువాలజీ

63

హిస్టరీ

31

ఎకనమిక్స్‌

48

సివిక్స్‌

48

కామర్స్‌

48

మొత్తం

840

Published date : 02 Aug 2021 03:09PM

Photo Stories