మార్కుల కోసం చదివే చదువు వ్యర్థం : ఆచార్య కె.హేమచంద్రారెడ్డి
Sakshi Education
వైవీయూ (వైఎస్సార్ కడప): భాషా సాహిత్యాలను విస్మరించి మార్కుల కోసం చదివే చదువు వ్యర్థం అని ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి అన్నారు.
వైఎస్సార్ జిల్లా కడప యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో ‘‘ ఆధునిక తెలుగు కవిత్వం: ఉద్యమాలు–వాదాలు–ధోరణులు’’ అన్న అంశంపై నిర్వహించిన మూడు రోజుల అంతర్జాతీయ వెబినార్ ఆగస్టు 27న ప్రారంభమైంది. ఇందులో పాల్గొన్న హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ..సాహిత్యం మానవ వ్యక్తిత్వాన్ని గొప్పగా తీర్చిదిద్దుతుందన్నారు. వెబినార్‌కు అధ్యక్షత వహించిన వైవీయూ వీసీ ఆచార్య మునగాల సూర్య కళావతి మాట్లాడుతూ..ప్రపంచ భాషల్లో తెలుగు రెండవ మధురమైన భాషగా నిలిచిందన్నారు. సదస్సులో వైవీయూ సంచాలకులు డాక్టర్ ఎన్.ఈశ్వరరెడ్డి, ఆచార్య ఆర్‌వీఆర్.సుందరం, ఆచార్య పేట శ్రీనివాసుల రెడ్డి కీలకోపన్యాసం చేశారు.
Published date : 28 Aug 2020 08:16PM