మార్చిలో కేఎల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష
Sakshi Education
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్‌లలో 2021-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మార్చి 8, 9, 10 తేదీల్లో ఆన్‌లైన్ ద్వారా మొదటి విడత ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వర్సిటీ వీసీ డాక్టర్ ఎల్‌ఎస్‌ఎస్‌రెడ్డి తెలిపారు.
విజయవాడ మ్యూజియం రోడ్డులోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో గురువారం ఆయన ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన గోడపత్రికను, కరపత్రాలను ఆవిష్కరించారు. కోర్సుల వివరాలు, ప్రవేశ పరీక్ష కేంద్రాలు, దరఖాస్తులను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు చెప్పారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామన్నారు.
Published date : 29 Jan 2021 02:51PM