మార్చి 4న టీఎస్ పీజీఈసెట్- 2020 నోటిఫికేషన్!
Sakshi Education
ఎంఈ/ఎంటెక్/ఎం.ఆర్క్/ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పీజీఈసెట్ నోటిఫికేషన్‌ను మార్చి 4వ తేదీన జారీ చేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది.
ఆన్‌లైన్ దరఖాస్తులను వచ్చే నెల 12వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వీకరించనుంది. ఆలస్య రుసుము తో మే 26వ తేదీ వరకు దర ఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. పరీక్షలను మే 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనుంది. ప్రతిరోజూ ఉద యం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు దఫాలుగా ఆన్‌లైన్‌లో పరీక్షలను నిర్వహించనుంది. హైదరాబాద్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. 28న ఉదయం ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు పీజీఈసెట్‌ను నిర్వహిస్తారు. అదేరోజు మధ్యాహ్నం ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్‌కు పరీక్ష ఉంటుంది. 29న ఉదయం జియో ఇంజనీరింగ్, జియో ఇన్ఫర్మాటిక్స్, ఫార్మసీకి పరీక్ష ఉంటుంది. అదేరోజు మ ద్యాహ్నం కంప్యూటర్ సైన్‌స అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు పరీక్ష ఉంటుంది. 30న ఉదయం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్‌కు, అదేరోజు మధాహ్నం సివిల్, ఎలక్ట్రికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీకి పరీక్ష ని ర్వహిస్తారు. 31వ తేదీన ఉదయం ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్, మధ్యాహ్నం నానో టెక్నాలజీకి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తారు. 120 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షల్లో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, మల్టిఫుల్ చాయిస్ జవాబులుంటాయి. ఆన్‌లైన్ దరఖాస్తు లు, ఇతర వివరాలను https://www.pgecet.tsche.ac.in, http://www.tsch e.ac.in వెబ్‌సైట్‌లో పొందవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1,000గా సెట్ కమిటీ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైతే రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
పీజీఈసెట్ షెడ్యూల్...
పీజీఈసెట్ షెడ్యూల్...
- 4-3-2020న: నోటిఫికేషన్
- 12-3-2020 నుంచి: ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సబ్మిషన్
- 30-4-2020: దరఖాస్తుల సబ్మిషన్‌కు చివరి గడువు
- 6-5-2020 వరకు: రూ. 500 ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్
- 13-5-2020 వరకు: రూ. 2 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్
- 20-5-2020 వరకు: రూ. 5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్
- 26-5-2020 వరకు: రూ. 10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్
- 20 నుంచి 27 వరకు: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
- 28 నుంచి 31 వరకు: పీజీఈసెట్ పరీక్షలు
- 15-6-2020: ఫలితాల వెల్లడి.
Published date : 20 Feb 2020 03:18PM