మార్చి 16 నుంచి ఓయూ డిగ్రీ, పీజీ పరీక్షలు
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఓయూలో వివిధ డిగ్రీ, పీజీ రెగ్యులర్ కోర్సుల ప్రాక్టికల్స్, రాత పరీక్షల నిర్వహణ తేదీలను ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ సోమవారం వెల్లడించారు.
డిగ్రీ సెమిస్టర్ రాత పరీక్షలను ఈ నెల 16 నుంచి, పీజీ సెమిస్టర్ పరీక్షలను 20 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు. డిగ్రీ ప్రాక్టికల్స్‌ను ఈ నెల 15 వరకు, పీజీ ప్రాక్టికల్స్‌ను ఈ నెల 19 వరకు పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఉస్మాని యా వెబ్‌సైట్లో చూడొచ్చు.
Published date : 02 Mar 2021 02:44PM