Skip to main content

క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో హెచ్‌సీయూ సత్తా!

రాయదుర్గం: క్యూఎస్‌ వరల్డ్‌ సబ్జెక్టు ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ సత్తా చాటింది.
ఈ మేరకు హెచ్‌సీయూ అధికారులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. గురువారం న్యూఢిల్లీలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌ ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. క్యూఎస్‌ వరల్డ్‌ సబ్జెక్టు ర్యాంకింగ్స్‌లో 2021 సంవత్సరంలో ఇంగ్లిష్‌ సబ్జెక్టు విభాగంలో హెచ్‌సీయూ గ్లోబల్‌ టాప్‌–300 లో నిలిచింది. కెమిస్ట్రీ సబ్జెక్టులో 351– 400 ర్యాంకుల్లో, లైఫ్‌ సైన్సెస్‌లో 501– 550 ర్యాంకింగ్‌లో, ఫిజిక్స్‌ సబ్జెక్టులో 551–600 ర్యాంకులో కొనసాగుతోంది. ఆర్ట్స్, హ్యూమానిటీస్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, నేచురల్‌ సైన్సెస్, సోషల్‌ సైన్సెస్, మేనేజ్‌మెంట్‌ వంటి సబ్జెక్టుల్లో కూడా ఉత్తమ ర్యాంకు సాధించింది.

చాలా సంతోషంగా ఉంది
‘క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌ 2021 సబ్జెక్టు ర్యాంకింగ్స్‌ టాప్‌–500లో ఇంగ్లిష్, కెమిస్ట్రీ రెండు విభాగాలలో నిలవడం చాలా సంతోషంగా ఉంది. దేశంలోనే అతి తక్కువ కాలంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మెరుగైన ఫలితాలు సాధించిన యూనివర్సిటీగా హెచ్‌సీయూ గుర్తింపు పొందింది. బోధనా సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, బోధనేతర సిబ్బంది సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది.’
– హెచ్‌సీయూ వీసీ ప్రొఫెసర్‌ అప్పారావు
Published date : 05 Mar 2021 05:08PM

Photo Stories