Skip to main content

‘క్యాంప్‌ గూగుల్‌' విజేత మ‌న తెలుగు విద్యార్థి

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): గూగుల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన 'క్యాంపు గూగుల్‌ 2020' జూనియర్‌ విభాగంలో గుంటూరుకు చెందిన కట్నేని హరికార్తీక్‌ విజేతగా నిలిచాడు.
హరికార్తీక్‌ గుంటూరులో కిడ్స్‌ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. గూగుల్‌ క్యాంపు ఇచ్చిన ఎక్స్‌ప్లోర్‌ అండ్‌ పెయింట్‌ (ఆన్‌ వాటర్‌ కన్జర్వేషన్‌), కోడింగ్‌ విత్‌ స్క్రాచ్‌ (గేమ్‌ క్రియేషన్‌ ఆన్‌ కోవిడ్‌–19), ఎక్స్‌ప్రెస్‌ థ్రూ స్టోరీస్‌ (ఏ మిస్టిక్‌ థ్రిల్లర్‌ స్టోరీ రైటింగ్‌), క్రాప్ట్స్‌ అండ్‌ స్కెచ్చింగ్‌ (ఆన్‌ ఇండియన్‌ క్రాప్ట్స్‌), కుకింగ్‌ అండ్‌ లెర్నింగ్‌ న్యూ లాంగ్వేజెస్‌ ఎసైన్‌మెంట్లలో హరికార్తీక్‌ ప్రథముడుగా నిలిచాడు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 15 మంది మాత్రమే విజేతలుగా నిలవడం గమనార్హం. వర్చువల్‌గా నిర్వహించిన గ్రాండ్‌ ఫినాలేలో భారత్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హరికార్తీక్‌ను అభినందించారు.
Published date : 10 Sep 2020 06:45PM

Photo Stories