క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాంలలో భారీ ఉద్యోగావకాశాలు.. వీరికి డిమాండ్ ఎక్కువ..
Sakshi Education
క్రిప్టోకరెన్సీల లావాదేవీలపై ప్రభుత్వం, నియంత్రణ సంస్థల వైఖరి ఎలా ఉన్నప్పటికీ.. దేశీయంగా వీటి ట్రేడింగ్, మైనింగ్ కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాంలు పెద్ద సంఖ్యలో నిపుణులను రిక్రూట్ చేసుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి.
వీటికి సాంకేతిక నైపుణ్యాలు అవసరం కావడంతో ఎక్కువగా తత్సంబంధ అంశాల్లో పరిజ్ఞానమున్న ఇంజనీర్లకు డిమాండ్ ఉంటోంది. బ్లాక్‌చెయిన్ డెవలపర్, బ్యాక్‌ఎండ్ డెవలపర్, క్రిప్టో ఇంజినీర్లు మొదలైన వారికోసం సంస్థలు అన్వేషిస్తున్నాయి. వీరితో పాటు ప్రోడక్ట్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్ సిబ్బంది నియామకాలు కూడా మొదలైనట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. సాంప్రదాయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలతో పోలిస్తే క్రిప్టో ప్లాట్‌ఫాంలలో ప్రారంభ వేతనాలు కనీసం 25–30 శాతం అధికంగా ఉంటుండటంతో.. ఇంజినీర్లు వీటిపై ఆసక్తి చూపుతున్నట్లు వివరించాయి. దేశీయంగా క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాంలలో ప్రారంభ వేతనాలు వార్షికంగా రూ. 9.5 లక్షల నుంచి ఉంటున్నాయి. రెండేళ్ల దాకా అనుభవం ఉన్నవారికి దాదాపు రూ. 22 లక్షల దాకా ప్యాకేజీ ఉంటోంది. ఇక సాలిడిటీ వంటి వినూత్న టెక్నాలజీలో కేవలం కొన్నాళ్ల అనుభవం ఉన్నవారికైతే ఏకంగా రూ. 45 లక్షల దాకా వార్షిక వేతన ప్యాకేజీ ఉంటోంది.
చదవండి: బీటెక్ తర్వాత వెంటనే కొలువు కావాలంటే.. ఈ 4.0 స్కిల్స్ ఉండాల్సిందే!
చదవండి: బ్లాక్‌చైన్ టెక్నాలజీ రంగంలో... 5లక్షల ఉద్యోగాలు
ఇతర ఉద్యోగాలకు సంబంధించి మార్కెటింగ్, ప్రోడక్ట్ డెవలపర్లకు మంచి డిమాండ్ ఉంటోంది. ఉదాహరణకు, అమెరికాలో లిస్టయిన కాయిన్‌బేస్ అనే భారీ క్రిప్టో ఎక్సే్చంజీ ప్లాట్‌ఫాం పెద్దయెత్తున నియామకాలు చేపడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచే దీనికి శ్రీకారం చుడుతున్నట్లు కంపెనీ భారత విభాగ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ గుప్తా ఇటీవల వెల్లడించారు. వచ్చే ఏడాది.. రెండేళ్ల వ్యవధిలో భారత్‌లో పూర్తి స్థాయి హబ్‌ను ఏర్పాటు చేసుకునే దిశగా ఇంజినీరింగ్, ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైన్ తదితర విభాగాల్లో భారీగా ఉద్యోగులను తీసుకునే యోచనలో ఉన్నట్లు చెప్పారు. 2012లో ప్రారంభమైన కాయిన్‌బేస్ ప్లాట్‌ఫాంపై బిట్‌కాయిన్, ఎథీరియం, లైట్‌కాయిన్ వంటి పలు క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్ జరుగుతోంది.
భిన్నమైన నైపుణ్యాలు..
ఇతర టెక్నాలజీ ప్లాట్‌ఫాంలతో పోలిస్తే క్రిప్టో రంగంలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు భిన్నంగా ఉంటాయి. ఇవి మార్కెట్లో నేర్చుకోవడానికి అంత సులువుగా లభించవు. క్రిప్టో రంగానికి బ్లాక్‌చెయిన్ సాంకేతికతలో సుశిక్షితులైన ఇంజినీర్లు అవసరమవుతారు. కోడ్‌ను వేగవంతంగా రూపొందించడం, వినియోగంలోకి తేవడంతో పాటు కోడ్ భద్రతపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒక్కసారి వినియోగంలోకి తెచ్చాక సొల్యూషన్స్‌లో మార్పులు చేయడానికి పెద్దగా అవకాశం ఉండదు కాబట్టి ఏ కాస్త తప్పిదం జరిగినా అటు యూజర్లు, ఇటు ప్లాట్‌ఫాంలు భారీగా డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. కనుక హ్యాకింగ్ దాడులనూ సమర్ధంగా తట్టుకునేలా ప్లాట్‌ఫాంలు సురక్షితంగా ఉండాలి. హ్యాకింగ్ జరిగితే సెకన్లలో కోట్ల డబ్బు తుడిచిపెట్టుకుపోతుంది. దీనికి కోడర్ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇంతటి రిస్కీ వ్యవహారం కాబట్టి కోడర్‌లకు ఆకర్షణీయమైన జీతభత్యాలు ఇవ్వాల్సి ఉంటుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి.
సందిగ్ధంలో ఉద్యోగార్థులు..
జీతభత్యాలు ఆకర్షణీయంగా ఉన్నా, క్రిప్టో సంస్థలపై నియంత్రణపరంగా స్పష్టత లేకపోవడంతో వీటిలో చేరడానికి ఉద్యోగార్థులు వెనుకాడుతున్నారు. క్రిప్టో కరెన్సీకి తాను అనుకూలమా లేక ప్రతికూలమా అన్న దానిపై రిజర్వ్ బ్యాంక్ ఇప్పటిదాకా స్పష్టతనివ్వలేదు. ఈ అనిశ్చితితో హైరింగ్‌పైనా ప్రభావం పడుతోంది. పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో తెలియని క్రిప్టో రంగంలోని సంస్థల్లో చేరడానికి చాలా మంది ఇష్టపడటం లేదని క్రిప్టో ఎక్స్‌చేంజీ నిర్వాహకులు అంటున్నారు. ఉద్యోగార్థులు చేరాలనుకున్నా వారి కుటుంబాల ఆందోళన వల్ల సదరు అభ్యర్థులు కూడా వెనక్కి తగ్గుతున్నారని పేర్కొన్నారు.
ప్రత్యేక కోర్సులు...
అర్హులైన ఇంజనీర్లకు డిమాండ్ ఉన్నప్పటికీ క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేస్తున్న వారు, మైనింగ్ చేస్తున్నవారిని కూడా రిక్రూట్ చేసుకునేందుకు క్రిప్టో సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. అవసరమైతే వారు రిఫ్రెషర్ కోర్సులు నేర్చుకునేందుకు కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రత్యక్షంగా ట్రేడింగ్ చేయడం ద్వారా వచ్చే అనుభవమనేది ఇతరత్రా విద్యాసంస్థల్లో నేర్చుకున్న దానికి మించి ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి. క్రిప్టో నైపుణ్యాలకు పెరుగుతున్న డిమాండ్‌కి తగ్గట్లుగా ప్రత్యేక కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లోని ఎంఐటీ మీడియా ల్యాబ్ .. క్రిపోకరెన్సీలపై ఆరు వారాల స్వల్పకాలిక ఆన్‌లైన్ కోర్సు అందిస్తోంది. గెట్‌స్మార్టర్ అనే డిజిటల్ ఎడ్యుకేషన్ కంపెనీ భాగస్వామ్యంతో అందించే ఈ కోర్సు ఫీజు రూ. 1.93 లక్షలుగా ఉంది. ఇటీవలే సింప్లీలియర్ అనే అంతర్జాతీయ డిజిటల్ నైపుణ్యాల సంస్థ .. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై నాలుగు నెలల ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రాం అందించేందుకు ఐఐటీ కాన్పూర్‌తో జట్టు కట్టింది.
నిపుణుల కొరత...
మధ్యవర్తి ప్రమేయం లేకుండా రెండు వర్గాలు క్రిప్టో లావాదేవీలు నిర్వహించడానికి ఉపయోగపడే కంప్యూటర్ ప్రోగ్రామ్‌లను స్మార్ట్ కాంట్రాక్టులుగా వ్యవహరిస్తారు. కొన్ని ప్రోగ్రామ్‌లలో శిక్షణ పొందిన వారికి డిమాండ్ అధికంగా ఉంటోంది. ఉదాహరణకు బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫాంలలో స్మార్ట్ కాంట్రాక్టులను అమలు చేసేందుకు ఉపయోగించే సాలిడిటీ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజీ నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. ఇది 2014లో తెరపైకి వచ్చింది. ఈ లాంగ్వేజీలో కేవలం కొన్నాళ్ల అనుభవం ఉన్న వారు కూడా వార్షికంగా రూ. 45 లక్షల దాకా వేతనం అందుకోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సుశిక్షితులైన వారి కొరత తీవ్రంగా ఉండటంతో ఎంతైనా ఇచ్చి తీసుకునేందుకు కంపెనీలు సిద్ధంగా ఉంటున్నాయి. బ్లాక్‌చెయిన్ ఇంజినీర్లకు నెలకు రూ. 1.45 లక్షల దాకా వేతనం ఇచ్చి తీసుకునేందుకు యునోకాయిన్ వంటి సంస్థలు సిద్ధంగా ఉన్నప్పటికీ నిపుణులు దొరకడం లేదు. దీంతో ప్రతిభావంతులైన ఇంజనీర్లను నియమించుకుని, వారికి శిక్షణనిచ్చుకోవాల్సి వస్తోంది. కాయిన్‌బేస్ వంటి పెద్ద సంస్థలు నియామకాలను గానీ చేపడితే.. పరిస్థితులు మారవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. దీనివల్ల మరింత మంది శిక్షణ పొంది, నిపుణుల కొరత కొంత తీరవచ్చని పేర్కొన్నారు. కేవలం ఇంజినీర్లే కాకుండా క్రిప్టో ఎక్స్‌చేంజీల్లో ఇతరత్రా సిబ్బంది అవసరం కూడా ఉంటోంది.

Published date : 18 Aug 2021 04:55PM