కోవిడ్ ఇన్సెంటివ్ మార్కులు కలపండి: పీజీ వైద్య విద్యార్థులు
Sakshi Education
సాక్షి, అమరావతి: గత 8 మాసాలుగా పీజీ వైద్య విద్యార్థులు కోవిడ్ సేవల్లో కష్టపడ్డారు.. దురదృష్టవశాత్తు కొంతమంది అభ్యర్థులు ఒకటి లేదా రెండు మార్కుల తేడాతో ఫెయిలయ్యారు.. వారికి కోవిడ్ ఇన్సెంటివ్ మార్కులు కలపాలని పలువురు వైద్య విద్యార్థులు కోరుతున్నారు.
బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్‌తో పాటు ఎంతోమందిని కోవిడ్ కారణంగా పరీక్షల్లో పాస్ చేశారని, పీజీ వైద్య విద్యార్థులకు కూడా ఒక్క అవకాశం ఇవ్వాలని ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ వైస్ చాన్స్ లర్‌కు వినతిపత్రం ఇచ్చారు. కోవిడ్ సేవల్లో ఉన్నందున ఇన్సెంటివ్ మార్కుల కింద కలిపితే విద్యాసంవత్సరం దెబ్బతినకుండా ఉంటుందన్నారు. ఇప్పటికే పలువురు వైద్య విద్యార్థులకు సూపర్ స్పెషాలిటీ ర్యాంకులు వచ్చాయని, 1,2 మార్కులతో ఫెయిలైపోవడం వల్ల జాతీయ కోర్సుల్లో చేరే అవకాశం కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
Published date : 09 Nov 2020 03:37PM