క్లీన్ అండ్ గ్రీన్ స్కూల్... మద్దెల్‌బీడ్ ప్రాథమిక ఉన్నతపాఠశాల
Sakshi Education
సాక్షి, దామరగిద్ద (నారాయణపేట జిల్లా): నాలుగేళ్ల క్రితం వరకు ఆ పాఠశాలలో ఒక్క మొక్క లేదు. అలాంటిది ఇప్పుడు చుట్టూ చెట్లతో ఓ ఆశ్రమా న్ని తలపిస్తోంది.
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని అక్షర సత్యంగా భావించి మొక్కలు నాటారు. మండలంలోని మద్దెల్‌బీడ్ ప్రాథమిక ఉన్నతపాఠశాలలో స్వచ్ఛభారత్- స్వచ్ఛవిద్యాలయ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంతో ‘ఇంటికి వంద-బడికి చందా’ నినాదంతో నిధులు సమకూర్చుకొని తగు సదుపాయాలు కల్పించి హరిత-స్వచ్ఛపాఠశాలగా తీర్చిదిద్దారు. 2016లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణరెడ్డి సమక్షంలో అప్పటికే అసంపూర్తిగా ఉన్న పాఠశాల ప్రహరీ, గేట్ నిర్మాణాలను ప్రభుత్వ, పాఠశాల అభివృద్ధి నిధులతో పూర్తి చేశారు. పాఠశాల ఆవరణలో హరితహారంలో పంపిణీ చేసిన మొక్కలను నాటి సంరక్షించారు. వేసవిలో అప్పటి సర్పంచ్ బాలప్ప ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీటిని అందించారు. మిగిలిన రోజుల్లో విద్యార్థులు నీటిని అందించి సంరంక్షించారు. దీంతో మొక్కలు మానులై పాఠశాల భవనానికి పచ్చని తోరణంగా మారాయి. మొక్కల పెంపకంతో పాఠశాల ప్రగతి బాటలో సాగుతోంది. పచ్చదనం ఉపాధ్యాయుల్లో మరింత ఉత్సా హాన్ని నింపింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్వచ్ఛ భారత్-స్వచ్ఛ విద్యాలయ’ లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆదేశాలతో ఇంటికి వంద బడికి చెందాపేరుతో పాఠశాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యాన్ని మరింత పెంచి అందరి సహకారంతో వందశాతం స్వచ్ఛపాఠశాలగా మలుచుకున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు వంటి సౌకర్యాలను మెరుగుపరిచారు. హ్యాండ్‌వాష్ కొళాయిలు, ప్రతి తరగతిలో చెత్తబుట్ట ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మురుగునీటిని మళ్లించేందుకు సోక్‌ఫిట్, తడి- పొడి చెత్త డంపింగ్ పిట్‌లు ఏర్పాటు చేశారు. గ్రామానికి శిక్షణలో భాగంగా సందర్శించిన ట్రెయినీ ఐఏఎస్‌లు పాఠశాల విద్యార్థులు కూర్చునేందుకు గ్రీన్‌కార్పెట్లను అందించారు.
దాతల సహకారం
పాఠశాలలో మౌళిక వసతుల కల్పనకే కాకుండా విద్యాభివృద్ధికి సైతం దాతలు తమవంతు సహకారాన్ని అందించారు. గ్రామానికి చెందిన సూర్య కృష్ణారెడ్డి డిజిటల్ పాఠాల బోధనకు రూ.60 వేల విలువతో టీవీ, నోటుపుస్తకాలు ఆటసామగ్రి అందించారు. ఆర్‌ఎంపీ వైద్యుడు నందు రూ.10 వేలతో హ్యాండ్‌వాష్ కొళాయిల నిర్మాణానికి రూ.10 వేలు అందించాడు. రిటైడ్ పీఈటీ బాల్‌రెడ్డి రూ.5వేలు, మరికొందరు బెంచీలు, క్రీడాసామగ్రి అందించారు. అలాగే, బాల సంఘాలు, పరిశుభ్రత కమిటీలు ఏర్పాటుచేసుకున్నారు. హ్యాండ్‌వాష్ లిక్విడ్‌తో చేతులు కడుక్కోవడం, భోజనం అనంతరం తడి పొడి చెత్తను వేర్వేరుగా పారవేసేందుకు డం పింగ్ ిపిట్లను సైతం నిర్మించారు.

గ్రామస్తుల సహకారంతోనే.. గ్రామస్తులు, ప్రజాప్రతినిదులు, ఎస్‌ఎంసీ చైర్మన్, కమిటీసభ్యులు, ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాలలో హరితహారం- స్వచ్ఛత సదుపాయాలను పూర్తి స్థాయిలో సమకూర్చుకున్నాం. పాఠశాల పరిసరాలు పరిశుభ్రత ప్రభావంతో అందరు స్వచ్ఛత పాటిస్తున్నారు. పాత భవనం శిథిలావస్థలో ఉన్నందున గదుల కొరత ఉంది. విద్యార్థుల సౌకర్యార్థం గదుల్లో డబుల్ డెక్స్ బెంచీల కోసం దాతలను సంప్రదిస్తున్నాం. - సత్యనారాయణరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు |
Published date : 09 Jan 2020 02:42PM