Skip to main content

కేంద్ర పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల డీఏ ఫ్రీజ్

న్యూఢిల్లీ: కేంద్ర పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది.
కోవిడ్ పొదుపు చర్యల్లో భాగంగా వారికి మూడు నెలలకోసారి ఇచ్చే డీఎను ఫ్రీజ్ చేస్తూ గురువారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రెజైస్ (డీపీఈ) ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమలు కానున్నాయి. ఆ తర్వాత 2021 జనవరి 1, 2021 ఏప్రిల్ 1 నుంచి పెరగాల్సిన డీఏలు అమలు కావు. 2021 జూన్ 30 వరకు డీఏ నిలిపివేత అమల్లో ఉంటుంది. వచ్చే ఏడాది జూలై 1నుంచి డీఏ పెంపును అమలు చేయనున్నారు. అప్పటి వరకు ఈ ఏడాది జూలై వరకు ఉన్న డీఏ మాత్రమే అమలవుతుంది. ఈ ఉత్తర్వులు విశాఖ స్టీల్‌ప్లాంట్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు, నాన్ యూనియనైజ్డ్ సూపర్‌వైజర్ ఉద్యోగులకు వర్తించనున్నాయి.
Published date : 20 Nov 2020 04:24PM

Photo Stories