కేజీబీవీలో ఇంటర్ ప్రవేశాలకు ధ్రువపత్రాల పరిశీలన
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్షా ఆధ్వర్యంలోని 171 ఇంటర్మీడియట్ కస్తుర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశంకోసం.. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుందని సమగ్ర శిక్ష ప్రాజెక్టు డెరైక్టర్ కె.వెట్రిసెల్వి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆగస్టు 25వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ పూర్తికాగా, ఎంపికైన వారి జాబితాను ఆయా కేజీబీవీలకు పంపడంతోపాటు విద్యార్థినుల మొబైల్ నెంబర్లకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారాన్ని అందుకున్న విద్యార్థినులు సెప్టెంబర్ 11 నుంచి 18వ తేదీలోగా సంబంధిత కేజీబీవీల్లోని స్పెషల్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. విద్యార్థినులు తమతోపాటు ఆధార్ కార్డు, బదిలీ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్, ఇ-పాస్ షార్ట్ మెమో తదితర పత్రాలను తీసుకువెళ్లాలని సూచించారు. ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే 9441270099, 9494383617 నంబర్‌లను సంప్రదించాలన్నారు.
Published date : 10 Sep 2020 01:34PM