‘కేజీబీవీ– 2021’ ప్రవేశాలకు గడువు జూలై 5 వరకు పొడిగింపు
Sakshi Education
సాక్షి, అమరావతి: సమగ్ర శిక్షా ఆధ్వర్యంలోని 352 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లో 2021–22 విద్యా సంవత్సరానికి 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు గడువు జూన్ 20తో ముగియనుందని, అయితే కోవిడ్ కారణంగా గడువును జూలై 5 వరకు పొడిగిస్తున్నామని పేర్కొన్నారు. ఒక్కో కేజీబీవీలో 6వ తరగతికి 40 సీట్లు, ఇంటర్‌కు 40 సీట్లు చొప్పున ఉన్నాయని తెలిపారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసిన వారు) పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ పరిధిలోని బాలికలు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.
‘హెచ్‌టీటీపీఎస్://ఏపీకేజీబీవీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఐఎన్’ వెబ్‌సైట్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇదివరకే కేజీబీవీల్లో చదివిన పదో తరగతి విద్యార్థినులు కూడా ఇంటర్‌లో ప్రవేశానికి ఆన్ లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. సమగ్ర వివరాలకు 94943 83617, 94412 70099లో సంప్రదించాలని సమగ్ర శిక్షా ఎస్పీడీ కోరారు.

Published date : 19 Jun 2021 02:49PM