కేఎంసీలో మాస్ కాపీంగ్‌పై విచారణ కమిటీ
Sakshi Education
ఎంజీఎం (వరంగల్): ఇటీవల కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో జరిగిన మెడికల్ పీజీ సప్లిమెంటరీ పరీక్షల్లో జరిగిన మాస్ కాపీయింగ్ ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటైంది.
కొందరు విద్యార్థులు కొందరు కేఎంసీ సిబ్బందితో కుమ్మకై ్క ప్రశ్నాపత్రాలను లీక్ చేయించి జవాబులను వెతికి ఉంచి, వైర్‌లెస్ రిసీవర్ ద్వారా సమాధానాలు రాసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రూ.లక్షలు చేతులు మారినట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ కమిటీ నియమించినట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్య మంగళవారం వెల్లడించారు. మాస్ కాపీయింగ్ ఒక్క రోజే జరిగిందా లేదా పరీక్షలు జరిగినన్ని రోజులు జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సప్లిమెంటరీ పరీక్ష చివరి రోజు మాత్రమే విద్యార్థి పరిపాలనాధికారులు పట్టుబడటమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
సీసీ ఫుటేజీలు పరిశీలిస్తే సరి..
సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన అన్ని రోజుల సీసీ కెమెరాల ఫుటేజీలు పూర్తిస్థాయిలో పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుందని పేర్కొంటున్నారు. హైటెక్ మాస్ కాపీయింగ్ వెనుక కొందరు ఉద్యోగుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూడా కేఎంసీలో నిర్వహించిన పలు పరీక్షల నిర్వహణ సందర్భంగా మాస్ కాపీయింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నా, పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు. దీంతో కొందరు ఉద్యోగులు మాస్ కాపీయింగ్‌ను ఇంకా చాకచాక్యంగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. కేఎంసీలోని ఉన్నత స్థాయి ఉద్యోగులే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సాయంతో ఇలా చేస్తున్నట్లు చర్చ సాగుతోంది.

Published date : 09 Dec 2020 02:56PM