కాంట్రాక్టు అధ్యాపకులకు మినిమమ్ పే స్కేల్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీలతో పాటు డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాప కులకు మినిమమ్ పే స్కేల్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
రెగ్యులర్ అధ్యాపకులకు ప్రస్తుత పీఆర్‌సీలో ఇచ్చే బేసిక్ పేమెంట్‌ను కాంట్రాక్టు అధ్యాపకులకు కూడా ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్థికశాఖ జూన్ 16వ తేదీన ఉత్తర్వులు జారీచేసింది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు ఇవ్వనున్నట్లు ఉత్తర్వులివ్వడంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రమణారెడ్డి, సురేశ్, ఆర్జేడీ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గాదె వెంకన్న హర్షం వ్యక్తంచేశారు.
Published date : 17 Jun 2021 09:11PM