కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలు మరో నెల పొడిగింపు
Sakshi Education
సాక్షి, అమరావతి: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలను మార్చి నెలాఖరు వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ బుధవారం ఉత్తర్వులిచ్చారు.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నవారి ఉద్యోగ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో పలు శాఖల కోరిక మేరకు మార్చి నెలాఖరు వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రైవేట్ ఏజెన్సీలు, దళారుల బారి నుంచి కాపాడేందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం వీరందరినీ దాని పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తికావడానికి సమయం పడుతున్నందున వారి పదవీ కాలాన్ని పొడిగించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Published date : 27 Feb 2020 01:57PM