కాళోజీ వర్సిటీకి కొత్త ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
డాక్టర్ వి.శాంతారామ్ (మాజీ డీన్, నిమ్స్), డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి (ఏఐజీ), డాక్టర్ విమలా థామస్ (ఎస్‌పీఎం, గాంధీ మెడికల్ కాలేజీ), డాక్టర్ పి.ధైర్యావన్ (మాజీ సూపరింటెండెంట్, గాంధీ మెడికల్ కాలేజీ), డాక్టర్ కె.ఇందిర (నిజామాబాద్ మెడికల్ కాలేజీ), డాక్టర్ జె.వెంకటేశ్వర్లు (ప్రొఫెసర్, కాకతీయ మెడికల్ కాలేజీ), డాక్టర్ ఎం.రమణి (డీన్, మల్లారెడ్డి మెడికల్ కాలేజీ)ని నియమిస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతకుమారి మార్చి 7 (శనివారం)నఉత్తర్వులు జారీ చేశారు.
Published date : 09 Mar 2020 12:30PM