Skip to main content

కాలేజీలకు యూజీసీ మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా యూనివర్సిటీలను, కాలేజీలను తెరిచేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గురువారం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది.
సెంట్రల్ యూనివర్సిటీలు, కేంద్ర నిధులతో పనిచేస్తున్న సంస్థలను తెరిచే విషయమై నిర్ణయాధికారాన్ని వాటి వైస్ చాన్సలర్లు, హెడ్‌లకు ఇచ్చింది. రాష్ట్ర పరిధిలో ఉన్న యూనివర్సిటీలు, కాలేజీలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు, సూచనలకు అనుగుణంగా తెరచుకోవచ్చని చెప్పింది. భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్లు వంటి కోవిడ్ నిబంధనలను పాటించాలని చెప్పింది. కంటెయిన్‌మెంట్ జోన్లలో విద్యా సంస్థలను తెరవరాదని స్పష్టం చేసింది. కంటెయిన్‌మెంట్ జోన్లలో ఉన్న విద్యార్థులు, అధ్యాపకులను రానివ్వరాదని పేర్కొంది.
Published date : 06 Nov 2020 04:19PM

Photo Stories