జూన్ 21 నుంచి ‘ఓపెన్ స్కూల్ సొసైటీ’ టెన్త్, ఇంటర్ పరీక్షలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) టెన్త్, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు జూన్ 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగనున్నాయి.
ఈ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం విడుదల చేశారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు జరుగుతాయి. ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు, వృత్తి విద్యాకోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 29 నుంచి జూలై 4వ తేదీ వరకు జరుగుతాయి.
Published date : 24 Mar 2021 04:36PM