జూలై 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించినా.. ఆన్‌లైన్‌లోనే బోధన!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
జూలై 1 నుంచి విద్యా సంస్థలన్నీ పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్–19 తీవ్రత రాష్ట్రంలో తగ్గుముఖం పట్టినప్పటికీ మున్ముందు మరింత ప్రమాదకర పరిస్థితులుంటాయనే ఊహాగానాల నేపథ్యంలో ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష తరగతుల నిర్వహణను మరికొంత కాలం వాయిదా వేసి ఆన్‌లైన్ బోధన చేపట్టాలని నిర్ణయానికి వచ్చింది. శనివారం విద్యా శాఖ మంత్రి సబితారెడ్డితో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి తదితరులు సీఎం కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఉపాధ్యాయుల సమస్యలతో పాటు పాఠశాలల పునఃప్రారంభం, బోధన తదితర అంశాలపై చర్చించారు. ఇంటర్మీడియట్, 9, 10 తరగతులకు ఆన్‌లైన్ బోధన తరగతులు వచ్చే నెల 1 నుంచి కొనసాగించాలని సీఎం ఈ సందర్భంగా విద్యా శాఖకు ఆదేశించినట్లు తెలిసింది. రోజూ సగం మంది ఉద్యోగులు మాత్రమే హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.
ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు..
పాఠశాలల పునఃప్రారంభంపై పాఠశాల విద్యా శాఖ ఇప్పటివరకూ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయలేదు. డిగ్రీ విద్యార్థులకు మాత్రం ప్రత్యక్ష బోధన చేపట్టనున్నట్లు కాలేజీ విద్యా విభాగం స్పష్టతనిచ్చింది. ఆన్‌లైన్ బోధనకు సంబంధించి సీఎం కేసీఆర్ తాజాగా చేసిన సూచనల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఆ మేరకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తరగతులని ర్వహణ, పరీక్షలు తదితరాలపై అకడమిక్ కేలండర్ రూపకల్పనలో తలమునకలైంది. దీనికి సంబంధించి నేడో, రేపో ఉత్త ర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
చదవండి: ఇంటర్ మార్కులెలా?.. సీబీఎస్ఈ విధానమా లేక ఫస్టియర్ మార్కుల ఆధారంగానా?
చదవండి: ఏపీ పరీక్షల రద్దు నిర్ణయంపై ఆచరణాత్మక తీరు ప్రశంసనీయం: సుప్రీంకోర్టు

Published date : 28 Jun 2021 04:17PM