Skip to main content

జోసా-2020 షెడ్యూల్ విడుదల

సాక్షి, ఎడ్యుకేషన్: జేఈఈ అడ్వాన్స్‌డ్, జేఈఈ-మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించి.. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, సీఎఫ్‌టీఐల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు ఉమ్మడి వేదిక.. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ(జోసా)! ఈ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొని..కోర్సు, కాలేజ్ పరంగా తమ ప్రాథమ్యాలను పేర్కొంటూ..ఛాయిస్ ఫిల్లింగ్ చేసి.. నచ్చిన కోర్సు, కాలేజీలో అడ్మిషన్ ఖాయం చేసుకోవచ్చు!!

Must Check:
JEE Main 2019 Opening and Closing Ranks

Analysis on JEE Main Ranks and Colleges

Online Class : JEE(Advanced) 2020 cut off by M.N Rao

జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ
గత ఐదేళ్లుగా జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ స్కోర్ల ఆధారంగా.. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, సీఎఫ్‌టీఐల్లో ప్రవేశానికి.. ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్న ఉమ్మడి కౌన్సెలింగ్ ప్రక్రియ.. జోసా! జోసా-2020 కౌన్సెలింగ్ ద్వారా 23ఐఐటీలు, 32 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలు, 30 సీఎఫ్‌టీఐలు.. ఇలా మొత్తం 111 ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశాలు పొందొచ్చు. జేఈఈ మెయిన్ ఉత్తీర్ణులు ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, సీఎఫ్‌టీఐల్లో కౌన్సెలింగ్, ఛాయిస్ ఫిల్లింగ్‌కు అర్హులు. కాగా, జేఈఈ అడ్వాన్స్‌డ్ అభ్యర్థులు ఐఐటీలు సహా అన్ని ఇన్‌స్టిట్యూట్‌లకు అర్హులే. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు అక్టోబర్ 5న వెలువడనున్నాయి.

జోసా-2020 షెడ్యూల్ ఇలా...

  • అక్టోబర్ 6-15: జోసా వెబ్‌సైట్‌లో అభ్యర్థుల రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ ప్రారంభం.
  • అక్టోబర్12: మాక్ సీట్ అలొకేషన్(సీట్ల కేటాయింపు నమూనా జాబితా)-1 విడుదల.
  • అక్టోబర్14: మాక్ సీట్ అలొకేషన్(సీట్ల కేటాయింపు నమూనా జాబితా)-2 విడుదల.
  • అక్టోబర్16: మాక్ సీట్ అలొకేషన్ ఆధారంగా ఇన్‌స్టిట్యూట్, బ్రాంచ్, ఇతర వివరాలను మార్చుకునే అవకాశం.
  • అక్టోబర్ 17: మొదటి దశ సీట్ల కేటాయింపు.
  • అక్టోబర్ 17-19: మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
  • అక్టోబర్ 21: భర్తీ అయిన సీట్లు, ఇంకా అందుబాటులో ఉన్న సీట్లు వివరాలు వెల్లడి.
  • అక్టోబర్ 21 సాయంత్రం 5 గంటలకు రెండో దశ సీట్ల కేటాయింపు.
  • అక్టోబర్ 22-23: రెండో దశలో సీట్లు పొందిన విద్యార్థుల ఆన్‌లైన్ రిపోర్టింగ్.
  • అక్టోబర్ 22- 24: రెండో దశ అలొకేషన్ ఉపసంహరణ.
  • అక్టోబర్ 26: రెండో దశ తర్వాత అందుబాటులో ఉన్న సీట్ల వివరాల వెల్లడి. అదే రోజు సాయంత్రం మూడో దశ సీట్ల కేటాయింపు.
  • అక్టోబర్ 27-28: మూడోదశ సీట్ల కేటాయింపు పొందిన విద్యార్థుల ఆన్‌లైన్ రిపోర్టింగ్.
  • అక్టోబర్ 27-29: మూడో దశ నుంచి ఉపసంహరణ
  • అక్టోబర్ 30: నాలుగో దశ సీట్ల కేటాయింపు. (మూడో దశలో భర్తీ అయిన సీట్లు, అందుబాటులో ఉన్న సీట్ల వివరాల వెల్లడి)
  • అక్టోబర్ 31-నవంబర్ 1: నాలుగో దశ సీట్ల కేటాయింపునకు సంబంధించి ఆన్‌లైన్ రిపోర్టింగ్.
  • అక్టోబర్ 31-నవంబర్ 2: నాలుగో దశ కేటాయింపుల ఉపసంహరణ.
  • నవంబర్ 3: అయిదో దశ సీట్ల కేటాయింపు.
  • నవంబర్ 4-5: అయిదో దశ ఆన్‌లైన్ రిపోర్టింగ్
  • నవంబర్ 4-6: సీట్ ఉపసంహరణ, ఎగ్జిట్ ఆప్షన్‌కు చివరి అవకాశం.
  • నవంబర్ 7: ఆరో దశ (ఐఐటీలకు చివరి దశ) సీట్ల కేటాయింపు.
  • నవంబర్ 9-13: ఎన్‌ఐటీ ప్లస్ సిస్టమ్ విధానంలో సీట్లు పొందిన విద్యార్థులు ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో వ్యక్తిగతంగా హాజరై డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://josaa.nic.in
Published date : 28 Sep 2020 02:51PM

Photo Stories