Skip to main content

జనవరి 9న అమ్మఒడి అందజేస్తాం: మంత్రి ఆదిమూలపు సురేష్

సాక్షి, తిరుపతి : డిసెంబర్ 26లోపు అమ్మ ఒడి లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
ఆయన డిసెంబర్ 23వ తేదీన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల్లో అభ్యర్థుల జాబితా పెడతామని, అందులో పేరులేని అర్హులైనవారు మళ్లీ నమోదు చేసుకోవచ్చని అన్నారు. డిసెంబర్ 30న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. జనవరి 9న ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమ్మ ఒడి నగదును తల్లుల ఖాతాలో వేస్తామన్నారు.

డబ్బులను ఫీజులకు ముడిపెడితే కఠిన చర్యలు..
ప్రయివేటు స్కూల్ విద్యార్థులకు కూడా అమ్మ ఒడిని ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దమనసుతో ప్రకటించారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ప్రతి స్కూల్ యాజమాన్యం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అమ్మ ఒడి డబ్బులను ఫీజులకు ముడిపెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతేడాది ఫీజు 70శాతం మాత్రమే తీసుకోవాలన్నారు. అమ్మ ఒడి డబ్బును ఫీజులతో ముడి పెట్టటం ఆక్షేపణీయమని, ఇలాంటి పని ఏ స్కూల్ యాజమాన్యం చేసినా ఒప్పుకునేది లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
Published date : 23 Dec 2020 05:07PM

Photo Stories