Skip to main content

జ్ఞాపకశక్తి పెరిగే మార్గమిదే..!

ఏకాంతంలో పనిచేయడం అలవాటు చేసుకోవాలి. మహత్ములందరూ ఏకాంతంలో తమకు గొప్ప స్పూర్తి లభిస్తుందని చెప్పినవారే.
అయితే ఈ యాంత్రిక యుగంలో ఏకాంతమే కరవైపోయింది. మనస్సు ప్రశాంతంగా ఒకే విషయంపై పనిచేయాలంటే దానికి ఏకాంతాన్ని కల్పించడం ఎంతైనా అవసరం. మనస్సులో అలజడి కలిగినప్పుడు అది మన శ్వాసలో ప్రతిబింబిస్తుంది. శ్వాసను త్వరగా తీసుకోవడం లేక నెమ్మదిగా తీసుకోవడం చేసినప్పుడు మానసిక స్థితిలో తేడాలు వస్తున్నాయని గ్రహించవచ్చు. మనస్సును నిరోధించే శక్తి శ్వాసకు ఉంది. మనం గాలిని ఎలా పీల్చివదులుతున్నామో నిరంతరం గమనించడం ద్వారా మనస్సు నిరంతరం ఒకే స్థితిలో ఉండేలా చేయడమే కాకుండా దానిని క్రమంగా మన స్వాధీనంలోనికి తెచ్చుకోవచ్చు. ఆపకుండా పనిచేసే మనస్సు క్రమంగా తన ఏకాగ్రతను కోల్పోతుంది. ప్రతి గంట పనికీ ఐదు పది నిముషాలు విశ్రాంతి తీసుకోవడం ద్వారా మనస్సును ఎక్కువసేపు ఏకాగ్రం చేసేయొచ్చు. తగినంత నిద్ర కూడా మెదడు సరిగా పనిచేయడానికి అవసరం. అంతవరకూ చేసిన పనిని నెమరు వేయ్యాలి. ఇది మన జ్ఞాపకశక్తిని బాగా పెంచే ఆయుధం. అంతేకాకుండా ఒకసారి ఒక విషయం చక్కగా మనస్సులో నాటుకున్న తర్వాత దానికి సంబంధించిన ఇతర విషయాలన్నింటినీ, నేర్చుకోవడానికి అర్థం చేసుకోవడానికి బాగా తోడ్పడు తుంది. ప్రత్యేకంగా కొన్ని పరిస్థితులలో, ప్రదేశాలలో, కొంతమంది వ్యక్తుల సమక్షంలో మన మనస్సు సరిగా నిలబడదు. అటువంటి పరిస్థితుల జోలికిపోకుండా ఉండడమే మేలు. ఏకాగ్రత లేకుండా క్షణక్షణంపొరపాట్లు చేసే వారి సాంగత్యం మంచిదికాదు. మరోవైపు కొందరు గొప్ప వ్యక్తుల సమక్షంలో మన మనస్సు దానంతట అదే ఏకాగ్రమవడాన్ని, ప్రశాంతమవ్వడాన్ని గమనించవచ్చు.
Published date : 25 Jan 2020 01:25PM

Photo Stories