జేఈఈ మెయిన్‌లో మెరిసిన తెలుగు విద్యార్ధులు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్ : ఐఐటీల్లో ప్రవేశాలకోసం నిర్వహించి జేఈఈ మెయిన్ పరీక్ష పలితాల్లో తెలుగు విద్యార్థులు మెరిసారు.
ఈ ఏడాది జనవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగిన జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలు శుక్రవారం అర్ధారాత్రి విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన వారు 9మంది ఉండగా... ఇందులో తెలుగు విద్యార్థులు నలుగురు ఉండటం గమనార్హం. వీరిలో తెలంగాణకు చెందిన రొంగల అరుణ్ సిద్దార్ధ, చాగరి కౌశల్‌కుమార్ రెడ్డి, ఆంద్రప్రదేశ్‌కు చెందిన లంధ జితేంద్ర, తాడవర్తి విష్ణు శ్రీసాయి శంకర్ ఉన్నారు. జేఈఈ మెయిన్ పరీక్ష రాసేందుకు దేశవ్యాప్తంగా 9,21,261 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా... 8,69,010 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మంచి స్కోరు సాధించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం జేఈఈ మెయిన్ పరీక్షలను ఏటా రెండుసార్లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్ 5నుంచి11వ తేదీల్లో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి వచ్చేనెల 7వ తేదీనుంచి ఆన్‌లైన్లో ఫీజు చెల్లింపులు, ఫోటోలు అప్‌లోడ్ చేసుకునే వీలు కల్పిస్తోంది.
కొత్త ఆవిష్కరణలంటే ఇష్టం
మెయిన్‌లో మంచి స్కోర్ వచ్చింది. ఇప్పుడు నా లక్ష్యం జేఈఈ అడ్వాన్స్పరీక్షే. ఐఐటీ బాంబేలో చదవాలని ఉంది. కానీ అడ్వాన్స్ ర్యాంకు బట్టి వచ్చే ఐఐటీలో చేరతా. కొత్త ఆవిష్కరణలంటే చాలా ఇష్టం. అమ్మ, నాన్న సహకారంతో ఆ దిశగా ముందుకు సాగుతా.
- చాగరి కౌశల్‌కుమార్ రెడ్డి, వంద పర్సంటైల్ సాధించిన విద్యార్థి
అడ్వాన్స్ లోనూ ఇంతే కష్టపడతా...
జేఈఈ మెయిన్‌లో వంద పర్సంటైల్ రావడం ఆనందంగా ఉంది. వాస్తవానికి జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు సన్నద్ధమవుతూనే మెయిన్ పరీక్షలు రాశా. మంచి ఫలితం వచ్చింది. అమ్మ,నాన్న ప్రోత్సాహం నాకు బలం. అడ్వాన్స్ లోనూ ఇదే తరహాలో కష్టపడి అత్యుత్తమ పర్సంటైల్ సాధిస్తా. బెస్ట్ ఐఐటీలో ఇంజనీరింగ్ చదవడమే నా లక్ష్యం.
- అరుణ్ సిద్దార్ధ, వంద పర్సంటైల్ సాధించిన విద్యార్థి

Published date : 20 Jan 2020 03:03PM