జేఈఈ మెయిన్ 2021 మార్చి సెషన్ అడ్మిట్ కార్డులు విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: జాయింట్ ఎంట్ర¯న్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2021 మార్చి సెషన్ అడ్మిట్ కార్డులను విడుదల చేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని వినియోగించి వీటిని డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. జేఈఈ మెయిన్ మార్చి సెషన్ పరీక్షలు ఈ నెల 16 నుంచి 18 వరకు జరగనున్నాయి. అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ కానివారు 011–40759000 నంబర్‌లో గానీ, jeemain@nta.ac.in కు కానీ మెయిల్ చేసి సంప్రదించాలని పేర్కొంది. ఒకే పరీక్షకు బహుళ అప్లికేషన్లు సమర్పించిన వారి అడ్మిట్ కార్డులు విత్‌హెల్డ్‌లో ఉన్నాయని, అలాంటి అభ్యర్థులు ఎన్టీఏను మెయిల్ ద్వారా సంప్రదించాలని పేర్కొంది.
Published date : 12 Mar 2021 03:41PM