జాతీయ విద్యావిధానంపై అపోహలొద్దు: ఆదిమూలపు సురేష్
Sakshi Education
సాక్షి, అమరావతి: జాతీయ నూతన విద్యావిధానం అమలుపై సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని, ఉపాధ్యాయులు దీనిపై ఎటువంటి అపోహలు చెందవద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యా సంస్కరణల్లో భాగంగా తీసుకుంటున్న కొన్ని చర్యలపై ఉపాధ్యాయులు రకరకాల ఊహాగానాలు తెస్తున్నారని, ప్రస్తుతం వీటి అమలుపై చర్యలు పరిశీలనలో (ప్రాథమిక దశలోనే) ఉన్నాయన్నారు. ఉపాధ్యాయుల నుంచి సూచనలు, సంఘాల ప్రతిపాదనలు తీసుకోవాలని ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను ఆదేశించామని తెలిపారు. త్వరలో పరిస్థితిని బట్టి భౌతికంగా గానీ లేదా వర్చువల్ విధానంలో కానీ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి సురేష్ తెలిపారు.
Published date : 09 Jun 2021 01:12PM