జాతీయ స్థాయిలో ‘అగ్రి’ విద్యార్థుల ప్రతిభ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పీజీ, పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం జాతీయ స్థాయిలో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్ధులు ప్రతిభ కనబరిచారు.
ఎంఎస్సీలో 134 మంది, పీహెచ్‌డీలో 28 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకు సాధించి వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలు పొందడానికి అర్హత సాధించడంతో పాటు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ను పొందనున్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు అభినందించారు. ప్లాంట్ సెన్సైస్‌లో రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల విద్యార్థిని వి.చంద్రిక (బీఎస్సీ అగ్రికల్చర్) జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. సైఫాబాద్‌లోని కమ్యూనిటీ సైన్స్ విద్యార్థులు జె.హేమలత, బి.నిహారిక, కమ్యూనిటీ సైన్సు పీజీ విభాగంలో మొదటి ర్యాంకు సాధించారు. మరో పదిమంది విద్యార్థులు కూడా పలు విభాగాలలో ర్యాంకులు సాధించారు.
Published date : 27 Nov 2020 01:52PM