Skip to main content

ఈసారి డిగ్రీ కోర్సుల ప్రవేశాల్లో భారీగా పెరుగుదల.. ఎందుకంటే..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కోర్సుల అడ్మిషన్లను ఈ ఏడాది ఆన్‌లైన్ విధానంలో చేపట్టడంతో బాలికలు ఎప్పుడూ లేనంతగా ఎక్కువ సీట్లు దక్కించుకున్నారు.
గతంలో డిగ్రీ తదితర నాన్ ప్రొఫెషనల్‌ కోర్సుల్లో బాలుర శాతంతో పోలిస్తే బాలికల చేరికలు 25 నుంచి 30 శాతం వరకు మాత్రమే ఉండేవి. కానీ, ఇప్పుడు దాదాపు 50 శాతానికి చేరువయ్యాయి. ప్రైవేటు కాలేజీల చుట్టూ సీట్ల కోసం తిరగాల్సి రావడం, తమకు సమీపంలోని కాలేజీల్లో నచ్చిన కోర్సులో సీటు రాని పరిస్థితుల్లో సుదూర ప్రాంతాల్లో చదవలేక చాలామంది బాలికలు డిగ్రీ కోర్సుల్లో చేరలేని పరిస్థితి నిన్న మొన్నటి వరకు ఉండేది. దీనికితోడు మహిళలకు 33.5 శాతం సీట్లు కేటాయించాల్సి ఉన్నా యాజమాన్యాలు వాటిని అమలుచేయకపోవడం కూడా బాలికల చదువులకు ఆటంకంగా ఉండేది. కానీ, ఈ ఏడాది సీఎం వైఎస్‌ జగన్ సర్కారు తీసుకున్న ఆన్‌లైన్ అడ్మిషన్ల విధానంతో బాలికలకు ఆ ఇక్కట్లు తప్పాయి. కాలేజీల్లో చేరికలు పెరిగేందుకూ దోహదం చేసింది.

ఓఏఎండీసీ ద్వారా సీట్ల భర్తీ
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కాలేజీలన్నింటిలోని సీట్లను ఉన్నత విద్యామండలి ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ సిస్టమ్‌ అండ్‌ సర్వీసెస్‌ (ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌) సహకారంతో ‘ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యూల్‌ ఫర్‌ డిగ్రీ కాలేజెస్‌’ (ఓఏఎండీసీ) ద్వారా భర్తీ చేయించింది. విద్యార్థులు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకుంటే వారికి ఆన్‌లైన్ ద్వారానే సీట్లు కేటాయించారు. అన్ని కాలేజీల్లోనూ 33.5 శాతం సీట్లను బాలికలతో భర్తీచేయడంవల్ల వారు కాలేజీల చుట్టూ తిరగకుండానే సీట్లు దక్కించుకోగలిగారు. పది యూనివర్సిటీల పరిధిలోని అన్ని కాలేజీల్లో ఫస్టియర్‌ ఆన్‌లైన్ అడ్మిషన్లలో బాలురు 1,35,724 మంది చేరగా, బాలికలు 1,25,659 మంది ఉన్నారు. ఇదిలా ఉంటే.. బాలికల్లో ఎక్కువ శాతం మంది బీఎస్సీ కోర్సు వైపు మొగ్గు చూపారు. బాలురకన్నా బాలికలే ఈ కోర్సుల్లో ఎక్కువమంది ఉన్నారు. బీఎస్సీ ఫస్టియర్‌ అడ్మిషన్లలో బాలికలు 71,554 మంది ఉండగా.. బాలురు 58,949 మంది ఉన్నారు.

ప్రైవేటు అక్రమాలకు చెక్‌
గతంలో ఆన్‌లైన్ అడ్మిషన్లు లేని సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంటు నిధుల కోసం ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు చేరికలు పెంచుకునేందుకు అక్రమాలకు పాల్పడేవి. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులు చేరకుండా తమ కాలేజీల్లో చేరేలా ప్రలోభాలకు గురిచేసేవి. కానీ, ఈ ఏడాది ఆన్‌లైన్ అడ్మిషన్ల విధానం ద్వారా సీట్ల భర్తీ చేపట్టడంతో కాలేజీ యాజమాన్యాలకు ఇందులో ఎలాంటి పాత్ర లేకుండాపోయింది. అలాగే, వారి ఒత్తిళ్ల ప్రభావం కూడా విద్యార్థులపై పడలేదనే చెప్పాలి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో సీట్ల భర్తీ గతంలో కన్నా ఈసారి రెట్టింపుయ్యింది. గతంలో 50 వేలలోపే ప్రభుత్వ, ఎయిడెడ్, వర్సిటీ కాలేజీల్లో సీట్లు భర్తీ అయ్యేవి. ఈసారి 80,662 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రైవేటు కాలేజీల్లో 1,80,721 సీట్లు భర్తీ చేశారు.

వర్సిటీ

బీఎస్సీ

బీ.కాం

బీఏ

ఇతర కోర్సులు

 

బాలురు

బాలికలు

బాలురు

బాలికలు

బాలురు

బాలికలు

బాలురు

బాలికలు

నాగార్జున

8,948

10,307

8,248

4,993

1,796

1,146

789

495

నన్నయ

10,313

13,855

7,022

5,511

2,685

2,132

1,959

1,587

ఆంధ్రా

12,386

12,841

3,861

3,637

2,519

1,981

1,411

1,020

బీఆర్‌ అంబేద్కర్‌

5,178

6,384

1,542

1,435

1,692

1,570

151

157

కృష్ణా

3,899

4,964

3,912

3,458

862

603

673

365

రాయలసీమ

4,350

5,804

4,913

2,815

2,741

1,689

601

326

శ్రీకృష్ణదేవరాయ

3,875

4,938

5,256

3,790

2,000

1,038

903

527

శ్రీవెంకటేశ్వర

4,843

5,331

8,590

5,609

1,215

766

1,580

979

విక్రమసింహపురి

2,215

3,433

2,820

1,922

600

416

1,405

715

యోగివేమన

2,942

3,697

3,847

2,644

849

690

333

89

మొత్తం

58,949

71,554

50,011

35,814

16,959

12,031

9,805

6,260

Published date : 13 Mar 2021 03:37PM

Photo Stories