ఇప్పట్లో సీబీఎస్‌ఈ పరీక్షలు నిర్వహించలేం: మంత్రి రమేష్ పోఖ్రియాల్
Sakshi Education
న్యూఢిల్లీ: కోవిడ్ నేపథ్యంలో 10, 12 తరగతుల విద్యార్థులకు సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా నిర్వహించలేమని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు.
కోవిడ్ పరిస్థితులను పరిశీలించిన తరువాత, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో 2021 ఫిబ్రవరి లోపు 10, 12వ తరగతుల సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలను నిర్వహించరాదని నిర్ణయించినట్టు ఉపాధ్యాయులతో ఆన్‌లైన్ సమావేశం సందర్భంగా మంత్రి వెల్లడించారు. 2021 సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలను ఆన్‌లైన్‌లో కాకుండా రాతపూర్వకంగా నిర్వహించనున్నట్టు ఇటీవలే సీబీఎస్‌ఈ ప్రకటించింది. ఈ యేడాది మార్చి నుంచి లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి.
Published date : 23 Dec 2020 04:30PM