Skip to main content

ఇంటర్ సెకండియర్ ఫీజు గడువు ఫిబ్రవరి 25 వరకు పొడిగింపు

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువునుఫిబ్రవరి25వ తేదీ వరకు పొడిగించారు.
ఏపీ ఇంటర్మీడియెట్2021 సిలబస్, ఎగ్జాం టైం టేబుల్, స్టడీ మెటీరియల్, మోడల్ పేపర్స్, ప్రిపరేషన్ గెడైన్స్, కెరీర్ గెడైన్స్... ఇతర అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.

ఈ మేరకు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సెకండియర్ రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిలైన విద్యార్థులు ఈ గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, వొకేషనల్ విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుంది. ఇదే చివరి పొడిగింపు అని తదుపరి పొడిగింపు ఉండదని బోర్డు స్పష్టం చేసింది. గడువు దాటిన తరువాత వచ్చే దరఖాస్తులకు రూ.500 ఆలస్య రుసుము ప్రతి అభ్యర్థి నుంచి వసూలు చేస్తారని వివరించింది.
Published date : 20 Feb 2021 03:09PM

Photo Stories